Thursday, April 18, 2013

గ్రంథసాంగుడు



ట్రింగ్ ట్రింగ్... ఫోను మోగింది.

పరాకు ప్రభాకర్ చిరాగ్గా ఫోనెత్తిండు, "పరాకు హియర్, అవతలెవరు?"

"ఒరే...  గుర్తు పట్టలేదా నేనయ్యా..."

సీట్లోంచి చెంగున లేచిండు పరాకు, నమస్కారం కూడా పెట్టిండు, అవతలాయనకు కనపడక పొయినా... "మిమ్మల్ని గుర్తు పట్టనంత వారమా జగడపాటి గారు? ఏమిటో తీరిక చేసుకుని మా వంటి వారి మీద దయ చూపారు?"

"ఆపవయ్యా నీ భట్రాజు పొగడ్తలు. అవతల నా బోల్తా హిల్స్ రేట్లు లక్షల్లెక్క పడి పొతున్నాయి. ఇక్కడనేమో ఇచ్చిన డబ్బులు కైంకర్యం చేయడం తప్ప నీ పని ఆవ గింజంత అయినా కదలడం లేదు. నీతో లాభం లేదయ్యా"

"అల్లా అంటే ఎలా చెప్పండి? మీ పెట్టుబడి వృధా పోనిస్తామా? నేను, నా బృందం రాత్రనక పగలనక అదే పని మీద శ్రమిస్తున్నాం."

"ఏంటయ్యా నీ శ్రమ? ఠంచనుగా నెల నెలా డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావ్. పని మాత్రం గడప కదలదు. నా ఫ్లాట్ల రేట్లు నెలకు రెండు లక్షల చొప్పున తగ్గు తున్నాయ్. అక్కడికీ ఆ  డిల్లీ నాయకున్నో, ఈ సంస్థ చైర్మన్నో పిల్చుకొచ్చి నోటికొచ్చినట్టు తెలంగాణాకు వ్యతిరేకంగా వాగిస్తూనే వున్నాను. నువ్వేమో ఒక పుస్తకం రాసేడవ్వయ్యా అంటే డబ్బులు పుచ్చుకోవడం తప్ప అక్షరం ఒలికించిన పాపాన పొవు."

"అదేంటి సార్ అలా అంటారు? నిజాలు రాయమంటే రోజుకో పుస్తకం రాయగలను. అబద్ధాలు రాయడం అంట సులభమా చెప్పండి? తిమ్మిని బమ్మి చేయడం మామూలు పనా? అవతల జనం నమ్మొద్దూ?"

"ఏంటయ్యా నమ్మేదీ? అలా రాయగలవనే గదా నిన్ను పెట్టుకుందీ? అంట బ్రహ్మ విద్య ఏముందీ అందులో? అవతల తెలంగాణా వాళ్ళు చెపుతున్న విషయాలు రోజూ పేపర్లో చూడడం లేదా? వాటికి వ్యతిరేకార్థకంగా రాస్తే సరి. అది కూడా చేయ లేవా?"

క్వచ్చన్ మార్కు మొకం పెట్టిండు పరాకు ప్రభాకర్ గారు, "ఎలా సార్? నాకు అర్థం గావడం లేదు."

కోపం లగాయించింది జగడపాటికి. "ఏముందయ్యా? ఫజల్ అలీ తెలంగాణా వద్దేవద్దన్నాడని చెప్పు. ఆంధ్రా కోటా ఉద్యోగాలు కూడా తెలంగాణా వారే చేస్తున్నారని చెప్పు. కృష్ణా గోదావరి నదుల మీది డ్యాములన్నీ తెలంగాణాలోనే వున్నాయి... ఆంధ్రాలో బీళ్ళున్నాయని రాయి. మరిచిపొయానయ్యొయ్... ఇప్పటిదాకా అంతా తెలంగాణా సీయములే పరిపాలించారని కూడా రాయి."

"అలా అంటే నమ్ముతారా సార్! చెప్పుచ్చుకుని కొట్టరూ జనం?"

"చెప్పింది చేయవయ్యా! సీయములంతా హైదరాబాద్ లో స్థిర పడ్దోల్లే గదా? అంటే తెలంగాణా వారేగా? అయిన నీ పుస్తకం చదివే దెవడయా? పోయిన సారి పుస్తకానికే నాకు పది లక్షలు బొక్క. తీరా చూస్తే పది మంది కూడా కొనలేదు. నీ పుస్తకం ఎవడో కొంటాడని కాదు నేను చెపుతున్నది. ఏదో ఇంత హడావుడి చేసి తెలంగాణా రాదని జనానికి నమ్మకం కలిగిస్తే నాలుగు ఫ్లాట్లు ఎక్కువ అమ్ముడు పోతాయని నా పాట్లు నేను పడుతున్నాను."

"అలాగా సార్! ఇక చూసుకోండి నా తడాకా!"


  



            

5 comments:

  1. తఢాకా చూపెడతారన్నమాట.:-)ha

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. డబ్బులు తీసుకుని ఉదయం చేస్తున్నది తెలంగాణా ఉద్యమ నాయకులు. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టిస్తే విశాకపట్నం, విజయవాడ ,గుంటూరు ల లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సకల జనుల సమ్మె తో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మన తెలంగాణా విద్యార్థులు చదవడానికి వెళ్తున్నారు. పరిశ్రమలు పెట్టేవాళ్ళు కోస్తా జిల్లాలకు వెళ్తున్నారు.

    నాయకులు అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులనుండి డబ్బు తీసుకుని ఉద్యమం చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఓహో! అంటే ఆంధ్రా వారు డబ్బులిచ్చి తెలంగాణా ఉద్యమం నడిపిస్తున్నారన్న మాట! మళ్ళీ వారే సమైక్యవాదం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారన్న మాట! అదేనా మీరుచ్ చెప్పదలుచు కున్నది?

      Delete