వెంకటేశ్ చెప్పిన టైముకు నిముషం గూడ లేటు చెయ్యడు. గియ్యా లేంది? గిట్ల యాది మరిచిండు?
వారం రోజుల నుంచి చూస్తున్న. వెంకటేశ్ అదో తీరుగ ఉండ బట్టిండు. ఎటో అలోచిస్తడు. ఏది చెప్పినా సరిగ్గా ఇనడు.
ఏందిరా వారి, ఎంకటేసు, ఎందుకురా గిట్లుంటున్నవ్. ఏమైందిర?
అడుగనే అడిగిన నిన్న నిన్న సాయంత్రం మొకం బట్టుకొని.
నాకేంగాలే, బాగనే ఉన్న.
సూస్తె తెలుస్త లేదా ఎట్లున్నవో? అద్దంల మొకం జూసుకో, తెలుస్తది. ఏమైతుందిర నీకు?
నాకేమైతలేదన్న, అయ్యేదంతా తెలంగాణకే. గా ఎమ్మెల్యేలు చూడు. గింత లొల్లి జరుగు తుంటే కూడ రాజీనామాలు చేస్త లేరైరి. మొన్న యూనివర్సిటీల కొచ్చి ఒక్కొక్కడు ఎట్లా మాట్లాడినరో చూస్తివి గద? ఇప్పుడు ఒక్క డన్న కాన పడుతున్నాడె?
నాకు ఒళ్ళంతా జల్లున ఒనికినట్టయింది. గీ పోరడు గూడ ఏదైనా అఘాయిత్యం చేస్తడా ఏమి?
అరె వెంకటేసు. గయ్యన్ని మన కెందుకుర? రాజకీయ నాయకులు లక్ష చెప్పుతరు, చూస్త లేమా? గట్లనే గిది. ఎట్లయ్యేది గట్లనే అయితది. మనం ఆప్తె ఆగదు, నడువమంటే నడువదు.
అన్నా! మీరంతా గిట్ల మాట్లాడ బట్టే తెలంగాణా మొత్తం గీ పరిస్తితి కొచ్చింది. మీరంతా చూస్తానే ఉండున్రి, రేపు తెలంగాణా మొత్తం సాపు సాపు చెయ్యకుంటే చూడున్రి.
గీని మాటలు చూస్త ఉంటె నాకు భయం ఎక్కువ గాబట్టింది. గీ ఆవేశం ఎక్కడికి దారి తీస్తదో?
అరే వెంకటేసు, తెలంగాణా ఒచ్చేది ఖాయంరా. గిప్పుడు తెలంగాణల ఐదు సంవత్సరాల పోరడు గూడ తెలంగాణ కావాలె అంటుండు. నువ్వేం భయపడకు. తెలంగాణా తప్ప కుండ వస్తది. మనం చూస్తం. దేనికైనా ఓపిక పట్టాలె.
ఇంకా ఓపికేందన్నా? ఇన్నాళ్ళు పోరాటం చేసినం. చిదంబరం ఒప్పుకొని స్టేట్ మెంట్ గూడ ఇచ్చిండు. గిప్పుడు అంత మొదటి కొచ్చె.
ఒస్తెమాయే లేర. ఇంకొక యాడాది బడుతది. అంతేగా? శ్రీకృష్ణ కమిటీ ఏసిన్రు గా? ఇప్పటి దాంక ఏ కమిటీ ఏసినా గూడ తెలంగాణకి అన్యాయం చెయ్యలే. గట్లనే ఈ కమిటీ గూడ తెలంగాణకే ఫేవర్ జేస్తది.
ఎక్కడున్న వన్న నువ్వు? గీ కమిటీల తోని తెలంగాణ ఒస్తదను కున్నవా? ఫజలలీ ఏం జెప్పిండు? తెలంగాణ సపరేటుగా ఉండాలే అన్నాడు. ఏమైంది? తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్ ల కలిపేసిన్రు. గట్లనే గీ కమిటీ చెప్పంగనే తెలంగాణ ఒస్త దనుకోవడమే తప్పు. పోరాటం చేస్తేనే తెలంగాణ వస్తది.
ఏం జెప్పాలెనో అర్థం గాలేదు నాకు. నా మనసుల మెదులు తున్న ఆలోచన వాని కెట్ల చెప్పుదు? చెప్పి వానికి లేని పోని ఆలోచనలు మనసుల చొప్పిద్దునా? ఎటూ సమజ్ ఆయిత లేకుండె నాకు.
సరే గని గిప్పుడు గాదు, రేపు మధ్యానం రెండున్నరకు మొగల్ దర్బారు కాడికి రా, మాట్లాడుదం. వెంకటేశ్ ఆవేశంగ ఏదో మాట్లాడుకుంట వెళ్లి పోయిండు.
ఆలోచిస్తుంటే అప్పుడే నాలుగయింది. ఏడి, పోరడు ఇంకా రాక పోయె?
గప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఇయ్యాల గన్ పార్కు దగ్గర ర్యాలి ఉన్నది. ఒక దిక్కు గుండె దబ దబ కొట్టు కోవట్టింది. నాకు తెల్వ కుంటనే అడుగులు గన్ పార్కు దిక్కు పడ సాగినై.
ఎదురుగ పెద్ద గుంపు. ఎవరో మాట్లాడు తున్నారు. చుట్టూ అందరు గుమి గూడి ఉన్నరు. దగ్గరి కెళ్ళి చూసిన. వెంకటేసు ఆవేశంగా మాట్లాడు తున్నడు. కండ్లు ఆవేశం తోని మెరుస్తున్నై.
... మనం తెలంగాణ వచ్చే దాంక కొట్లాడాలే. ఒదిలి పెట్టేది లేదు. మనం ఏమాత్రం అజాగ్రత్త చేసినా తెలంగాణ రాదు. గట్లని ఎవ్వరు గూడ ఆత్మహత్యలు చేసు కోవద్దు. ధైర్యంగ పోరాడాలె...
ఇంక తర్వాత చెప్పేది నేను వినలే. ఇప్పుడు నా మనసు గాలిల తేలుతుంది. వెంకటేసుకి నేను చెప్పే పని లేదు. వాడే నలుగురికి చెప్పేటోడైండు.
ఇట్లాటి టపోరీ గాళ్ళకు తెలంగాణ ఇస్తేనేమి? ఇవ్వకుంటే నేమి? హోల్ మొత్తం ఇండియా ఇస్తేనేమి?
ReplyDeleteదమాకే లేనోళ్ళకి రాష్ట్ర విభజనతో పనేమి? ఏంటో అర్థం లేదు, ఎవడో గావాల అంటే ఎర్రి గొర్రెల్లాగా 'గియ్యండి , గియ్యండి ' అని అరుస్తున్నరు కాని, ముక్కల్చేస్తే ఎట్లా బాగుపడతామో ఒక్కరూ దమాగ్ వ్పయోగించి అడగట్లేరు. బ్రతుకులు బాగుపడతాయంటే తెలంగాణా ని 10 ముక్కలు చేసినా పర్వాలేదు, కాని ముక్కల్ చేస్తే ఇట్లా అవుతుంది? ఎవరైనా సోచాయిస్తున్రా?
సచ్చుడొ తెలంగాణా వచ్చుడొ అంటే కమిటీ వచ్చింది.టివిల వలన ప్రజలందరికి అన్ని విషయాలు బాగ అర్థము అవుతున్నయి. తెలంగాన వచ్చినా రావచ్చు. ప్రజలకు Yఎమి మార్పు వుండదు.కొందరికి కొత్త పదవులు వస్తాయి. అంతే.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteపినాక పానీ
ReplyDeleteటపోరీ అంటే ఏందన్న? తెలుగు పదమా ఇంకేదన్నా? తెలంగాణా కావలె అంటె టపోరీలైతే, పొండి అన్నా కలిసుంటాం అని ఎంట పడేతోల్లను ఏమనాలె? గది గూడ చెప్పా రాదె? నీకు దమాకు చాల ఎక్కువ ఉంటె గది తీసుక పొయ్యి నీ ఆంధ్ర ని బాగా చేసుకో.
kvrn
తెలంగాణా వస్తే తప్పకుండ మార్పు ఉంటది. గా విషయం లబో దిబో మంటున్న ఆంధ్ర, రాయల సీమ మాట లల్లనే తెలుస్తున్నది.