Thursday, April 18, 2013

గ్రంథసాంగుడు



ట్రింగ్ ట్రింగ్... ఫోను మోగింది.

పరాకు ప్రభాకర్ చిరాగ్గా ఫోనెత్తిండు, "పరాకు హియర్, అవతలెవరు?"

"ఒరే...  గుర్తు పట్టలేదా నేనయ్యా..."

సీట్లోంచి చెంగున లేచిండు పరాకు, నమస్కారం కూడా పెట్టిండు, అవతలాయనకు కనపడక పొయినా... "మిమ్మల్ని గుర్తు పట్టనంత వారమా జగడపాటి గారు? ఏమిటో తీరిక చేసుకుని మా వంటి వారి మీద దయ చూపారు?"

"ఆపవయ్యా నీ భట్రాజు పొగడ్తలు. అవతల నా బోల్తా హిల్స్ రేట్లు లక్షల్లెక్క పడి పొతున్నాయి. ఇక్కడనేమో ఇచ్చిన డబ్బులు కైంకర్యం చేయడం తప్ప నీ పని ఆవ గింజంత అయినా కదలడం లేదు. నీతో లాభం లేదయ్యా"

"అల్లా అంటే ఎలా చెప్పండి? మీ పెట్టుబడి వృధా పోనిస్తామా? నేను, నా బృందం రాత్రనక పగలనక అదే పని మీద శ్రమిస్తున్నాం."

"ఏంటయ్యా నీ శ్రమ? ఠంచనుగా నెల నెలా డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావ్. పని మాత్రం గడప కదలదు. నా ఫ్లాట్ల రేట్లు నెలకు రెండు లక్షల చొప్పున తగ్గు తున్నాయ్. అక్కడికీ ఆ  డిల్లీ నాయకున్నో, ఈ సంస్థ చైర్మన్నో పిల్చుకొచ్చి నోటికొచ్చినట్టు తెలంగాణాకు వ్యతిరేకంగా వాగిస్తూనే వున్నాను. నువ్వేమో ఒక పుస్తకం రాసేడవ్వయ్యా అంటే డబ్బులు పుచ్చుకోవడం తప్ప అక్షరం ఒలికించిన పాపాన పొవు."

"అదేంటి సార్ అలా అంటారు? నిజాలు రాయమంటే రోజుకో పుస్తకం రాయగలను. అబద్ధాలు రాయడం అంట సులభమా చెప్పండి? తిమ్మిని బమ్మి చేయడం మామూలు పనా? అవతల జనం నమ్మొద్దూ?"

"ఏంటయ్యా నమ్మేదీ? అలా రాయగలవనే గదా నిన్ను పెట్టుకుందీ? అంట బ్రహ్మ విద్య ఏముందీ అందులో? అవతల తెలంగాణా వాళ్ళు చెపుతున్న విషయాలు రోజూ పేపర్లో చూడడం లేదా? వాటికి వ్యతిరేకార్థకంగా రాస్తే సరి. అది కూడా చేయ లేవా?"

క్వచ్చన్ మార్కు మొకం పెట్టిండు పరాకు ప్రభాకర్ గారు, "ఎలా సార్? నాకు అర్థం గావడం లేదు."

కోపం లగాయించింది జగడపాటికి. "ఏముందయ్యా? ఫజల్ అలీ తెలంగాణా వద్దేవద్దన్నాడని చెప్పు. ఆంధ్రా కోటా ఉద్యోగాలు కూడా తెలంగాణా వారే చేస్తున్నారని చెప్పు. కృష్ణా గోదావరి నదుల మీది డ్యాములన్నీ తెలంగాణాలోనే వున్నాయి... ఆంధ్రాలో బీళ్ళున్నాయని రాయి. మరిచిపొయానయ్యొయ్... ఇప్పటిదాకా అంతా తెలంగాణా సీయములే పరిపాలించారని కూడా రాయి."

"అలా అంటే నమ్ముతారా సార్! చెప్పుచ్చుకుని కొట్టరూ జనం?"

"చెప్పింది చేయవయ్యా! సీయములంతా హైదరాబాద్ లో స్థిర పడ్దోల్లే గదా? అంటే తెలంగాణా వారేగా? అయిన నీ పుస్తకం చదివే దెవడయా? పోయిన సారి పుస్తకానికే నాకు పది లక్షలు బొక్క. తీరా చూస్తే పది మంది కూడా కొనలేదు. నీ పుస్తకం ఎవడో కొంటాడని కాదు నేను చెపుతున్నది. ఏదో ఇంత హడావుడి చేసి తెలంగాణా రాదని జనానికి నమ్మకం కలిగిస్తే నాలుగు ఫ్లాట్లు ఎక్కువ అమ్ముడు పోతాయని నా పాట్లు నేను పడుతున్నాను."

"అలాగా సార్! ఇక చూసుకోండి నా తడాకా!"


  



            

Saturday, April 13, 2013

ఎవడీ కాట్జూ?



ఎవడీ కాట్జూ?

వాడెప్పుడన్న తెలంగాణల అడుగు పెట్టిండా? తెలంగాణా చరిత్ర తెలుసుకున్నాడా? తెలంగాణ బాధలు అర్థం చేసుకున్నడా?

వాడు మానభంగం చేస్తే ఉరెయ్యాలని అరిచిండట. ముంబై మారణ హోమానికి కారణమైన వారికి క్షమాభిక్ష పెట్టాలని కూడా కోరిండట! వాని తిక్క మాటలు చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంది? వాడు ఏదీ సరిగ్గా తెలుసుకోడని, మెదడు ఉపయోగించి ఆలోచించడని, నోటికోచ్చినంత వాగుతడని. గట్లాంటోడు వాగే వాగుడు మనకు అవసరమా? గాని సర్టిఫికేటు మనకు గావాల్నా?

పుర్రెలోని గుజ్జు ఏమాత్రం వాడకుండ భద్రంగా దాచుకునే కొంతమంది జడ్జీలుగా కూడా వెలగ బెడుతరు. ఆ తరువాత పైరవీ పోస్టులు కూడా అలంకరించు కుంటరు. అంత మాత్రాన వాళ్ళ మాటలకు విలువ ఉండవలసిన అవసరం లేదు. ఇయ్యవలసిన అవసరం అంతకన్నా లేదు.

వాడు తెలంగాణా మొత్తం తిరిగి కరువు, కరెంటు మోటార్లు, ఫ్లోరీను నీళ్ళు, వొంగిపోయిన అవయవాలు, ఎండిపోయిన  భూములు, పోర్లిపోయిన జలాలు... కాల్లొచ్చిన ఉద్యొగాలు, భూములు, గనులు చూసినంక మాట్లాడితే వాని మాటలకు విలువ వుండేది. గట్ల కాకుండ డిల్లీల కూసోని నోటికొచ్చింది వాగేతోని మాటలకు విలువ నియ్య వలసిన అవసరం లేదు. 'వాడు గట్ల మాట్లాడెనే' అని మిడుక వలసిన అవసరం అసలే లేదు.


ఇక్కడి నీళ్ళు, ఇక్కడి భూములు తెలంగాణాకు మాన ప్రాణాల వంటివి. అటువంటి వాటిని ప్రతిరోజూ దోచుకుంటున్న ఆంధ్ర పెత్తందార్లు నీ కండ్ల పడలేదా? ఒక్క రేపు చేసి నోళ్లను ఉరేస్తే మరి వాళ్ళను ఏమి చెయ్యాలే? జెర చెప్పవా కట్జూ? నువ్వు చెప్ప లేవు, ఎందుకంటే నువ్వూ ఆ తాను ముక్కవే.

రేపుకు ఉరెయ్యాల్ననేది నీ సేన్సేషనలిస్ట్ యావ అయితే, సంఘ విద్రోహికి క్షమాభిక్ష పెట్టాల్ననేది నీ అసలు రంగు.