నాలుగు లక్షల మంది ఉద్యోగులు, వాళ్లకు సంఘీభావంగా నాలుగు కోట్లమంది ప్రజలు ఉద్యమిస్తున్నా, ఈ తోలుమందం ఆంధ్రా బాజీ గవర్నమెంటుకు చీమ కుట్టుత లేదు. దోపిడీ శక్తులకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వానికి గాంధేయ వాదం పనికి రాదనీ అర్థమయ్యింది.
కాబట్టి ఉద్యమ దిశను మరో కోణం లోకి మార్చవలసిన అవసరం వచ్చింది. ఒకవైపు గాంధేయవాదాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఉద్యమం వలన కలిగే నష్టం తెలంగాణా ప్రజలకు కాక, దోపిడీ శక్తులకు, వాటికి కొమ్ము కాసే ప్రభుత్వాలకు ఆ నష్టాలు బదిలీ కావాలి. ఉద్యమాల రూపకల్పన ఆ విధంగా వుండాలి.
నలభై ఎనిమిది గంటల రైల్ రోకో కార్యక్రమం అలాంటి కార్యక్రమాలలో ఒకటి. దీనితో ఉద్యమమ తీవ్రత, ప్రభావం ఒక్క తెలంగాణాపై కాక పూర్తి దక్షిణ భారత దేశం పై పడింది. జాతీయ మీడియా ఎలాగూ దోపిడీ శక్తుల కొమ్ము కాస్తూ, ఉద్యమ వార్తలను ప్రసారం చేయడం లేదు. కాబట్టి తోటి భారతీయులకు ఉద్యమం గురించి తెలియ జెప్పాలంటే అంతర్రాష్ట్రీయంగా ప్రభావం చూపే పద్ధతులను అవలంబించడం తప్పని సరి.
ఇక పొతే ఏ హైదరాబాదుపై అలవి కాని నిర్లజ్జా పూరితమైన మక్కువతో సమైక్య శక్తులు రాష్ట్ర విభజనను అడ్డగిస్తున్నయో, ఆ హైదరాబాదుకి సీమాంధ్ర నుండి వచ్చే అన్ని మార్గాలను దిగ్బంధించి నిరవధికంగా మూసి వేయాలి.
హైదరాబాదులో అక్రమ ఆస్తులు కూడబెట్టిన కబ్జాకోరుల ఆస్తులలో జెండాలు పాతాలి. తెలంగాణా ప్రజలు అలాంటి ఆస్తులు జప్తు చేసుకొని శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా హైదరాబాదును అప్పనంగా దోచుకోవడం కలలో కూడా వీలుకాదు అనే భావన ఈ దోపిడీ శక్తులకు కలుగ జేయాలి.
ఇంకా ఇలాంటి పోరాట రూపాలను తెలంగాణా వచ్చే వరక్కు నిరంతరంగా రూపొందిస్తూనే వుండాలి.